చిత్తూరు తాగునీటి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి: పవన్ కల్యాణ్

రిపోర్టర్: శివ స్థలం: చిత్తూరు

చిత్తూరు మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనులను గడువులోగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఏడాది చివరినాటికి పూర్తి కావాల్సిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో రూ. 2,370 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 25 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందనుంది.