రష్యాలో నిర్బంధం నుంచి విడుదలైన నోయిడా ఇంజనీర్

రిపోర్టర్: శివ స్థలం: Russia

రష్యాలో గత వారం అరెస్టయిన నోయిడా ఇంజనీర్ చందన్ గుప్తా క్షేమంగా విడుదలయ్యారు. మాస్కోలోని తన ఇంటికి ఆయన చేరుకున్నట్లు భార్య స్నేహా గుప్తా ధృవీకరించారు. రష్యా సైన్యంలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారంటూ ఆమె చేసిన ఎస్ఓఎస్ వీడియో కలకలం రేపింది. యూఫ్లెక్స్ సంస్థ అందించిన న్యాయ సహాయం, కేంద్ర ప్రభుత్వ దౌత్యపరమైన మద్దతుతో ఆయన విడుదలైనట్లు ఆమె తెలిపారు.