కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై మండిపాటు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అరెస్టుకు డిమాండ్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మేడిపల్లి

దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపునకు కారణమవుతున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను అరెస్టు చేయాలని, సర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరీష్, అన్వర్ డిమాండ్ చేశారు. ఉప్పల్ బస్ డిపో వద్ద చేపట్టిన నిరసనలో వారు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రక్రియపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు.