రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు నర్సంపేట విద్యార్థిని ఉదయశ్రీ ఎంపిక

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

నర్సంపేటలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎడ్ల ఉదయశ్రీ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లిక్కి రమేష్ కుమార్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో అక్టోబర్ పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఈ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ కోట రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయశ్రీని పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.