ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: ఇండోర్
ఇండోర్లో జరిగిన ఛత్రో కీ గూంజ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను, వృద్ధులను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యవహరించారని బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ఈ సంస్కృతి కారణంగానే కాంగ్రెస్ పార్టీ యువతలో ఆదరణ కోల్పోయిందని వారు విమర్శించారు.