విశాఖలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖ జిల్లా పరిధిలోని గాజువాక, పరవాడ, సబ్బవరం మండలాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. రాత్రి వేళల్లో తవ్వకాలు జరిపి, పగటిపూట నిల్వ కేంద్రాల నుంచి విక్రయిస్తున్నా భూగర్భ గనులు, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్టీ టవర్ల సమీపంలోనూ తవ్వకాలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.