కృత్రిమ మేధపై కఠిన నియంత్రణలు అవసరం లేదు: ట్రంప్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమెరికా

కృత్రిమ మేధ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న వాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. ప్రతికూల శక్తులే ఈ సాంకేతికతపై భయాలను పెంచుతున్నాయని మండిపడ్డారు. చైనాపై అమెరికా ఆధిక్యాన్ని కొనసాగించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఏఐలో ఎవరు గెలిస్తే వారే ప్రపంచ విజేతలని ట్రంప్ పేర్కొన్నారు.