వెంకటాచలంలో దారుణం: బీరు బాటిల్తో యువకుడి గొంతు కోసేందుకు యత్నం

రిపోర్టర్: గోపి స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో పాత వివాదాలు మరియు మద్యం మత్తులో యువకుడిపై హత్యాయత్నం జరిగినట్లు సీఐ అంకమ్మ తెలిపారు. పలుకూరువారిపాలెం గ్రామానికి చెందిన శేషు, అన్వేష్, సంపత్, రవి అనే యువకులు అంకయ్యను ఇడిమేపల్లి చెరువు వద్దకు పిలిచి బీరు బాటిల్తో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.