అల్లూరి జిల్లాలో టేకు వనాలను వణికిస్తున్న శిలీంద్ర వ్యాధి

రిపోర్టర్: కృష్ణ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి గూడెంకొత్తవీధికి వెళ్లే మార్గంలో ఉన్న టేకు ప్లాంటేషన్కు శిలీంద్రవ్యాధి సోకిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. రింతాడ వద్ద అటవీశాఖ సంరక్షణలో ఉన్న టేకుచెట్లు ఈ వ్యాధి కారణంగా పూర్తిగా ఎండిపోయాయని వారు పేర్కొన్నారు. ఒకవైపు పచ్చదనంతో కళకళలాడుతున్న చెట్ల మధ్య, ఈ టేకుచెట్లు ఎండిపోయి వింతగా కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈ వనాలను కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.