మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడిపై సీబీఐ కేసు నమోదు

రిపోర్టర్: గోపి స్థలం: వైరా

వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు, మాజీ ఐటీ అధికారి జీవన్ లాల్‌తో పాటు ఆయన భార్య, సీఐఎస్‌ఎఫ్ డిఐజీ షిఫ్రా శ్రీవాస్తవపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. 2022 నుంచి 2025 మధ్య కాలంలో జీవన్ లాల్ అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని రూ.1.11 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఈ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.