ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.
రిపోర్టర్: శివ
స్థలం: India
చావత్ గల్లీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఇంట్లో ఫ్రిజ్ పేలడం వల్లనే ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ విషాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.