వర్ధన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ గా నియమించినందుకు ఎమ్మెల్యే నాగరాజుకు కృతజ్ఞతలు
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం శ్రమించిన తనను వర్ధన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ గా ఎన్నుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికీ దొమ్మటి రాజన్న గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుకు, మండల & టౌన్ పార్టీ అధ్యక్షులు పోశాల వెంకన్నకు, ఈగ దామోదర్ కు, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ రైతు సంక్షేమానికి కృషి చేస్తానని రాజన్న గౌడ్ హామీ ఇచ్చారు.