'ప్రాజెక్టు పూర్తి చేసి రైతులను ఆదుకుంటాం': ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ రూపురేఖలు మార్చే ప్రతిష్టాత్మక వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లో పైపు లైన్ల నెట్‌వర్క్‌ కోసం ప్రభుత్వం రూ.63 కోట్లు విడుదల చేయగా, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక చొరవతో అటవీ, వన్యప్రాణి అనుమతులు సాధించారు. పర్యావరణ అనుమతుల సిఫార్సులతో పాటు డిసెంబర్ నెలలో రూ.3,227 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించేందుకు కృష్ణా డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజినీర్ విభాగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.