ప్రేమ వివాహమా లేదా పెద్దల పెళ్లా: థియేటర్లలోకి త్వరలో మూడు రెండు ఒకటి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

ప్రేమ వివాహం మరియు పెద్దలు కుదిర్చిన పెళ్లి నేపథ్యంలో తెరకెక్కిన మూడు రెండు ఒకటి చిత్రం ఈ నెల ఇరవై మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శకుడు చిలుముల శాంతికుమార్ తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ స్వచ్ఛమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. మోహిత్ పెద్దాడ మరియు లావణ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వంగపాటి రామానుజ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.