సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాల ఉత్సవాల నిధుల గోల్‌మాల్
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వహణలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎలాంటి టెండర్లు పిలవకుండానే రూ.4 లక్షల విలువైన భోజనాల కాంట్రాక్ట్ పనులను నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అధికారులు కట్టబెట్టారు. వాటాల పంపకంలో తేడాలు రావడంతో ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు చేరింది. ప్రధాన దేవాలయాల్లో బోనాల ఏర్పాట్లకు సంబంధించి మరికొన్ని విభాగాల్లోనూ నిధులు కాజేశారనే ఆరోపణలపై విచారణ జరపాలని ఆలయాల పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.