అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక: సర్వతోముఖ యుద్ధం ప్రకటన

రిపోర్టర్: రాము స్థలం: తెహ్రాన్

అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలపై ఇరాన్ తీవ్రస్థాయిలో యుద్ధ హెచ్చరికలు జారీ చేసిందని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్రేజా హాజీ బాబాయీ స్పష్టం చేశారు. వాషింగ్టన్ కు మద్దతు ఇచ్చే ఏ దేశమైనా శత్రువుగా మారుతుందని, సైనిక, ఆర్థిక మరియు సాంకేతిక కేంద్రాలపై దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇరాన్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ ఇంధన సరఫరాను దెబ్బతీస్తామని ఆయన స్పష్టం చేయడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.