కాగజ్నగర్లో భారీ చోరి: రిటైర్డ్ ఉపాధ్యాయుని ఇంట్లో దొంగల బీభత్సం

రిపోర్టర్: కిరణ్ స్థలం: కాగజ్‌నగర్

కుమారుడి అనారోగ్య చికిత్స నిమిత్తం కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వెళ్లిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు తాటి రవీందర్ ఇంట్లో దొంగలు పడ్డట్లు స్థానికులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీనగర్ మెయిన్ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువాలోని నగదు, బంగారం అపహరించారు. పనిమనిషి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేశారు.