'నవంబర్ 20న మీ ముందుకు వస్తున్నాం': హీరో దుల్కర్ సల్మాన్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫీల్ గుడ్ మూవీ 'ఆకాశంలో ఒక తార' విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నవంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.