స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి సీఎం చంద్రబాబుకు కానుకగా ఇవ్వాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన కూటమి వ్యూహాత్మక సమావేశంలో ఆమె మాట్లాడుతూ అభివృద్ధియే తమ అజెండా అని స్పష్టం చేశారు. విభేదాలు పక్కన పెట్టి అభ్యర్థుల గెలుపునకు శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తెదేపాలో చేరారు.