గ్రామాల్లో హిజ్రాల ఆగడాలు: ఉదయాన్నే ఇళ్ల చుట్టూ తిరిగి డబ్బుల డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తొగుట

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గ్రామాల్లో ట్రాన్స్ జెండర్ల బలవంతపు వసూళ్లు పెరిగాయి. ఉదయం ఆరు గంటలకే ఇళ్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కేవలం శుభకార్యాల సమయాల్లో మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు ప్రతిరోజూ తమను ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు తీవ్రంగా వాపోతున్నారు. ఈ సమస్యపై తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.