కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపాటు

రిపోర్టర్: గోపి స్థలం: ఆదిలాబాద్

ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, పంటలు వేయవద్దని చెప్పే అసమర్థులకు పదవిలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, మాజీ మంత్రులు అవినీతికి పాల్పడ్డారని కవిత తీవ్రంగా ఆరోపించారు.