'గంజాయి వినాశనానికి దారి': అల్లూరి పోలీస్ హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

గంజాయి వినియోగం ఆరోగ్యానికి, కుటుంబాలకు, సమాజానికి తీవ్ర హానికరమని అల్లూరి పోలీస్ స్పష్టం చేశారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలు చట్టరీత్యా నేరమని, ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని వెల్లడించారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా యువత దీనికి దూరంగా ఉండాలని కోరారు. గంజాయి అక్రమ రవాణాపై ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు తెలపాలని అల్లూరి పోలీస్ విజ్ఞప్తి చేశారు.