కుప్పంలో హంద్రీ నీవా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: కుప్పం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవ రోజు పర్యటనలో భాగంగా గుండిశెట్టిపల్లె వద్ద హంద్రీ-నీవా జలాలకు జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపే మహత్తర కార్యక్రమాలు జరుగుతున్నాయని నేతలు తెలిపారు.