హోంగార్డు ఖాదర్ అహ్మద్ విశిష్ట సేవలను ఘనంగా సత్కరించిన సీపీ
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
పోలీస్ శాఖలో హోంగార్డుగా విశిష్ట సేవలందించిన షైక్ ఖాదర్ అహ్మద్ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా మంచిర్యాలలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అంకితభావంతో విధులు నిర్వహించిన ఖాదర్ అహ్మద్ సేవలను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.