నిజామాబాద్లో ఘనంగా ప్రారంభమైన శ్రీ జండా బాలాజీ జాతర

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ జండా బాలాజీ దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ స్వామివారి జండా జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి, పవిత్ర జండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.