రేవంత్ పాలనపై కేసీఆర్ ప్రశ్నల వర్షం: కరెంటు కోతలపై రైతన్న ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Telangana

స్వచ్ఛ్ బయో కంపెనీ కుంభకోణంపై తాము ప్రశ్నించి రెండేళ్లు అవుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని ఒక రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేశామని వాపోయారు.