యూపీ పోలీసు సబ్ ఇన్సెక్టార్ నియామకాలకు హైకోర్టులో భారీ షాక్

రిపోర్టర్: రమేష్ స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్సెక్టార్ నియామక ప్రక్రియకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని అధికారులు తెలిపారు. అలహాబాద్ హైకోర్టు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వుల జారీపై స్టే విధించిందని న్యాయవాదులు వెల్లడించారు. పరీక్షా విధానంలోని మార్పులపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ ఐదుకు వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు స్పష్టం చేశాయి.