మదనపల్లె కోర్టులో లొంగిపోయిన తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్చార్జి జయచంద్రరెడ్డి
రిపోర్టర్: అశోక్
స్థలం: అన్నమయ్య జిల్లా
అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్చార్జి జయచంద్రరెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో కోర్టు వారికి సెప్టెంబర్ 28 వరకు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నకిలీ మద్యం రాకెట్‌పై విచారణ తుది దశకు చేరుకుంది.