నగరంలో పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ: జోన్లు, ఠాణాల మార్పులతో ప్రజల్లో అయోమయం
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జోన్లు, డివిజన్లు, శాంతిభద్రతల పోలీస్ స్టేషన్ల పరిధులను మళ్లీ మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఇటీవలి మార్పుల గందరగోళం నుంచి తేరుకోకముందే మళ్లీ మార్పులు చేయడంతో పోలీసులు, ప్రజల్లో తీవ్ర అయోమయం నెలకొంది. కొన్ని ఠాణాల మార్పులు, డివిజన్ల పేర్ల మార్పులతో పాటు ట్రాఫిక్ విభాగంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.