ఏషియన్ క్రీడల్లో కాంస్య, రజత పతకాలు సాధించిన క్రీడాకారులకు బీజేపీ అభినందనలు

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

ఆసియా క్రీడల మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్య పత్రం సాధించిన ప్రా చౌదరిని అలాగే షాట్పుట్లో వరుసగా మూడోసారి పతకం గెలుచుకున్న తేజిందర్పాల్ సింగ్ తూర్ను భారతీయ జనతా పార్టీ అభినందించింది. ఈ మేరకు అధికారిక సామాజిక మాధ్యమ వేదికగా BJP (National) స్పందిస్తూ వారి పట్టుదల, కఠిన శ్రమ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వేదికపై మరింత ఇనుమడింపజేశాయని కొనియాడారు. ఈ అథ్లెట్ల ఘనత దేశంలోని కోట్లాది మంది యువతకు, ముఖ్యంగా మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.