రాజకీయ సంచలనం: మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి మాక్ పార్లమెంట్
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ సమావేశానికి మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మీరా కుమార్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఓటరే కీలకమని, ఓటు హక్కును కోల్పోతే ప్రజాస్వామ్య ఆత్మ క్షోభిస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.