పుతిన్‌కు తిరుక్కురళ్ రష్యన్ అనువాద ప్రతిని బహుమతిగా ఇచ్చిన మోదీ

రిపోర్టర్: సతీష్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ పుతిన్‌కు పురాతన తమిళ సాహిత్య కావ్యం 'తిరుక్కురళ్' రష్యన్ అనువాద ప్రతిని అరుదైన బహుమతిగా అందించారు. భారత్-రష్యా మధ్య చారిత్రక, సాహిత్య మరియు తత్వశాస్త్ర సంబంధాలకు ఈ కానుక ప్రతీకగా నిలిచింది.