చిరునవ్వుల సాయం: సీఎం సహాయ నిధికి చిన్నారుల పిగ్గీ బ్యాంక్ విరాళం

రిపోర్టర్: కృష్ణ స్థలం: మహారాష్ట్ర

దుర్భిక్ష పరిస్థితులతో అల్లాడుతున్న రైతన్నలను ఆదుకునేందుకు తమ పిగ్గీ బ్యాంకులో దాచుకున్న మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలను విరాళంగా అందించిన చిన్నారుల ఉదారతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసలు కురిపించారు. మన చిన్న సాయం రైతు మామల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తుందని తొమ్మిదేళ్ల చిన్నారి వరద తిమాండే తెలిపినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.