బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ పీఓ ఫలితాలు విడుదల

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇన్‌స్టిట్యూట్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఆగస్టు 22, 23 తేదీల్లో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ ద్వారా సెప్టెంబర్ 30 వరకు చూసుకోవచ్చని ఐబీపీఎస్ వెల్లడించింది. ఈ రిక్రూట్‌మెంట్ కింద ఖాళీల సంఖ్యను 7,565కు పెంచినట్లు అధికారులు తెలిపారు.