తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల రేసులో తీవ్ర పోటీ
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
తెలంగాణ కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల భర్తీపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఈ పదవిని లక్కీ పోస్ట్‌గా భావిస్తున్న నేతలు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తుండగా, సామాజిక సమీకరణాల ఆధారంగా రోహిణ్ రెడ్డి, ఓబేదుల్లా కొత్వాల్, బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నివేదిక ఆధారంగా త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.