కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన హరీశ్ రావు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

శ్రీశైలంలో నీళ్లున్నా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తలేని చేతకాని ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కల్వకుర్తి ప్రాజెక్టులో ఐదు మోటార్లు ఉంటే కేవలం ఒకటి లేదా రెండు మాత్రమే ఆన్ చేసి, అది కూడా పగటిపూట మాత్రమే నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో మూడు లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించామని ఆయన గుర్తు చేశారు.