జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత వాహన తనిఖీలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Andhra Pradesh

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు. నేరాలను అదుపు చేయడం, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమైన కూడళ్లు, రహదారులపై పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.