ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు దుర్మరణం
రిపోర్టర్: హరి
స్థలం: సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా కొల్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వేగంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.