గంగాధరనెల్లూరు మండలం కె.నాశంపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం కె.నాశంపల్లి గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. యూత్ లీడర్ పి.పూర్ణచంద్ర గ్రామస్థుల నడుమ తొలి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలతో పాటు జనసేన నేతలు కిషోర్, చంద్రశేఖర్, సుబ్రమణ్యం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు సమర్పించారు.