గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో ఎస్పీ నితికా పంత్ పర్యవేక్షణ
రిపోర్టర్: కిరణ్
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు ఎస్పీ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (SP KB Asifabad) వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ నితికా పంత్, కాగజ్నగర్ సబ్ డివిజన్ కలెక్టర్ హర్ష్ చౌదరీ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ నియంత్రణ తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.