ఇడిమేపల్లిలో బీర్ బాటిల్ తో దాడి: యువకుడిని చంపుతామంటూ బెదిరింపుల వీడియో వైరల్
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో అంకయ్యపై నలుగురు యువకులు బీర్ బాటిల్ పగలగొట్టి దాడి చేసిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. వినాయక చవితి నిమజ్జన వివాదం నేపథ్యంలో జరిగిన ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.