కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ హత్య.. మహిళ హత్య.. భర్త అరెస్ట్....
మంచిర్యాల జిల్లా
కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ హత్యకు గురైన ఘటన నెన్నెలలో చోటుచేసుకుంది.
ఈ కేసులో మృతురాలి భర్త తోట మల్లేష్‌ను నెన్నెల పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలు తోట సబిత (38)గా పోలీసులు గుర్తించారు.
బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనూక్ తెలిపిన వివరాల ప్రకారం..
భార్యపై అనుమానంతో మల్లేష్ తరచూ గొడవపడుతూ వేధించేవాడని దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 2న దంపతుల మధ్య గొడవ జరగడంతో సబితపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మల్లేష్ అక్కడి నుంచి పరారయ్యాడు.
నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 4న సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు తాళ్లగురజాల వై-జంక్షన్ వద్ద మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.
నిందితుడిని పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన పోలీసు సిబ్బందిని ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ సీహెచ్ హనూక్ అభినందించారు....