గోదావరి కావేరి అనుసంధానంపై ప్రధాని మోదీతోనే సాధ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రిపోర్టర్: రాము
స్థలం: విజయవాడ
గోదావరి కావేరి నదుల అనుసంధానంతో దక్షిణాది రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడ పున్నమి ఘాట్ వద్ద జరిగిన విజయవాడ ఉత్సవ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ వేడుకకు హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో నదుల అనుసంధానం అలాగే తాగునీటి అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. 2047 నాటికి దేశం అగ్రగామిగా మారుతుందన్నారు.