చంద్రశేఖర్ రెడ్డికి అవార్డు ఇచ్చిన ప్రముఖులు

రిపోర్టర్: sai స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లా రెండు రోజుల పునశ్చరణ తరగతుల్లో విన్న అంశాలను ఆచరణలో పెట్టి జర్నలిస్టులు గా మెరుగైన ఫలితాలు సాధించాలని సి. ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ కోరారు. రెండు రోజుల పునశ్చరణ తరగతుల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ పూర్తి క్రమశిక్షణతో రెండు రోజులు జరిగిన తరగతుల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు నెల్లూరు గ్రామీణ విలేఖరుల కు ధన్యవాదాలు తెలిపారు.

ఆయా అంశాల్లో నిష్ణాతులైన సీనియర్ జర్నలిస్టులు, ఫాకల్టీ సభ్యులు ద్వారా పునశ్చరణ తరగతులు నిర్వహించామన్నారు.

ఈ ముగింపు కార్యక్రమంలో నెల్లూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ వేణుగోపాల్, నెల్లూరు విశాలాంధ్ర బ్యూరో ఛీఫ్ శ్రీ కె. దయా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రెండు రోజుల పునశ్చరణ తరగతుల్లో పాల్గొన్న గ్రామీణ విలేఖరుల కు మీడియా అకాడమీ ఛైర్మన్ సర్టిఫికేట్లు, అకాడమీ ప్రచురించిన పుస్తకాలు అందించారు.