ఫోన్ ట్యాపింగ్ కేసులో కలకలం: ఏ1గా బీఆర్ఎస్ నేత హరీశ్ రావు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సిద్దిపేట
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ లో గతంలో నమోదైన కేసును సిద్దిపేట వన్‌టౌన్ కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త ఎఫ్ఐఆర్ లో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావును ఏ1 నిందితుడిగా పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో అక్రమంగా ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు కాగా, రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది.