జన్నారం మండలంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీడీవో ఉమర్ షరీఫ్ వెల్లడి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించామని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. ఇటీవల మండలంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో గ్రామాల్లో మురుగునీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించకపోతే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తూ పంచాయతీ కార్యదర్శులకు తగు ఆదేశాలు జారీ చేశారు.