ది ప్యారడైజ్ చిత్రంపై నిరాశ వ్యక్తంచేస్తున్న నెటిజన్లు

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ది ప్యారడైజ్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి నిరాశజనక స్పందన లభించింది. సినిమాలోని మాస్ యాక్షన్ అవతార్ నానికి సరిపోలేదని, ఆర్టిఫిషియల్గా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. జెర్సీ, అంటే సుందరానికి లాంటి ఫీల్ గుడ్ చిత్రాలనే తాము కోరుకుంటున్నామని, వింటేజ్ నాని కావాలని ఎక్స్ వేదికగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.