వైద్య సేవలు అందక అల్లాడుతున్న బాంజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
బాంజీపేట పీహెచ్సీలో సిబ్బంది కొరతతో వైద్య సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 12 సబ్సెంటర్ల పరిధిలో 60 వేలకుపైగా ప్రజలకు సేవలందించాల్సిన కేంద్రంలో వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు. సమయపాలన లోపంపై తరచూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.