బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించనున్న ఎఫ్‌పీఏ ఇండియా
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు ఈ నెల 26న హైదరాబాద్‌లోని పంజగుట్ట ఎఫ్‌పీఏ ఇండియా కార్యాలయంలో 9 నుంచి 20 ఏళ్ల వయస్సు గల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 18 ఏళ్ల లోపు బాలికలు తల్లిదండ్రులతో వచ్చి ఆధార్ కార్డు చూపాలని, ఆసక్తి గలవారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.