కరువు మండలంగా అనంతసాగరాన్ని గుర్తించాలి: తహసీల్దార్కు జనసేన నాయకుల వినతి
రిపోర్టర్: praveen kumar
స్థలం: ఆనంతసాగరం
అనంతసాగరం మండలంలో వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని, వెంటనే మండలాన్ని కరువు మండలంగా గుర్తించాలని జనసేన పార్టీ నాయకులు తహసీల్దార్ను కోరారు. చదలవాడ హరీష్ కుమార్ సూచనల మేరకు ముత్తంశెట్టి కృష్ణ ఆధ్వర్యంలో తహసీల్దార్ కే. వీర వసంతరావుకు వినతిపత్రం అందజేశారు. పంటలు బీడుగా మారుతున్నాయని, రైతులకు తగిన సాయం అందించాలని నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.